: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటితే... చంద్రబాబు వారి ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచారని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రాంత ప్రజలు కలిసుండాలని, మరో ప్రాంత ప్రజలు విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఎంతో సాధించామని, ఇప్పుడు విడిపోవాలన్న భావన బాధిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News