: దీపావళి ఎఫెక్ట్.. రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్లు లేవు


ఈ నెల 10వ తేదీ వరకు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర రైల్వే నిర్ణయించింది. దీపావళి, ఛట్ పూజ పండుగల సందర్భంగా ప్రయాణీకుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ సరైరోహిల్లా, ఆనంద్ విహార్ టెర్మినల్ స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు నిలిచిపోనున్నాయి. వృద్ధులను, ప్రమాదాల బారిన పడ్డవారిని, ఒంటరిగా, పిల్లలతో కలిసివెళ్తున్న మహిళలను, వికలాంగులను రైళ్లు ఎక్కించేందుకు వచ్చే వారితో ఫ్లాట్ ఫాం టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో, టికెట్ టెర్మినల్స్ వద్ద భారీ క్యూలు ఏర్పడతాయని, ఆ రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News