: అసోంలో పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి
ఆందోళనకారులు బస్సును తగులబెట్టడంతో అసోంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. రాభా-హాసోంగ్ స్వయంప్రతిపత్తి మండలి ఎన్నికల నేపథ్యంలో.. గోల్ పారా జిల్లాలోని క్రిష్ణాయ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహంతో బస్సుకు నిప్పంటించారు. దాంతో, వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అనంతరం కాల్పులు జరిపారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.