: ఇందిరాగాంధీ పంజాబ్ ను విడదీసినట్టు సోనియా ఏపీని విభజించాలి: వినోద్


నాటి ప్రధాని ఇందిరాగాంధీ పంజాబ్ నుంచి హర్యానాను విభజించినట్టు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీయాలని టీఆర్ఎస్ నేత వినోద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేసి రాష్ట్ర విభజనకు మార్గం సుగమం చేయాలని సూచించారు. అఖిలపక్షం సమావేశంలో సీమాంధ్రులు తమకు ఏం కావాలో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ వివేక్ అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టిన తరువాతే విలీనం గురించి ఆలోచిస్తామని వినోద్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News