: తెలంగాణపై మాట మార్చినందుకే నిరసన: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణపై మాట మార్చినందుకే విజయమ్మ పట్ల నల్గొండ జిల్లాలో నిరసన వ్యక్తమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం పంట నష్టం పేరిట పర్యటిస్తున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను తెలంగాణ వాదులు అడ్డుకున్నారని అన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ తెలంగాణకు అనుకూలంగా తన విధానాన్ని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.