: ముగ్గురి మృతదేహాలను బంధువులకు అప్పగించాం: డీకే అరుణ
వోల్వో బస్సు ప్రమాద ఘటనలో మరణించిన వారిలో ముగ్గురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను వారి బంధువులు గుర్తించడంతో అప్పగించామని మంత్రి డీకే అరుణ తెలిపారు. ఎనిమిది రోజుల్లో డీఎన్ ఏ ఫలితాలు వస్తాయని, అనంతరం, మిగిలిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు.