: మతాలవారీగా ఓట్ల యుద్ధం జరగనుంది: సురవరం
రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలను మతాలవారీగా చీల్చి ఓట్లు దండుకునే కుట్ర జరుగుతోందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అయోధ్య పర్యటన తలపెట్టిన తరువాతే ముజఫర్ నగర్ అల్లర్లు చెలరేగాయని అన్నారు. నిన్న షిండేను కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని తాము కోరినందునే విభజన విధానంపై అఖిలపక్ష సమావేశాన్ని ప్రకటించారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.