: విజయమ్మ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు, ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఖమ్మం జిల్లా పైడిపల్లి ప్రాంతంలో వరదబాధితులను పరామర్శిస్తున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా విజయమ్మ ఆందోళనకు దిగారు. పోటీగా తెలంగాణవాదులు కూడా ఆందోళన చేపట్టారు. దీంతో, రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.