: నల్గొండ జిల్లా భువనగిరిలో బాంబు కలకలం!
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన అనంతరం చోటు చేసుకున్న పలు సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఎవరో వదిలి వెళ్లిన టిఫిన్ బాక్సులు, సైకిళ్లను చూస్తే ప్రజల గుండెలు దడదడలాడుతున్నాయి. మరో్వైపు, రాష్ట్రంలో ఎక్కడో చోట బాంబుల కలకలం రేగుతూనే ఉంది.
తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లా భువనగిరిలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక భద్రాద్రి సినిమా థియేటర్లోకి నలుగురు వ్యక్తులు ఓ బ్యాగుతో ప్రవేశించబోయారు. అయితే, తనిఖీల పేరిట పోలీసులు బ్యాగు తెరవమనడంతో వారిలో ముగ్గురు పరారయ్యారు. ఒక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.