: మన్మోహన్ శ్రీలంక వెళుతున్నారా?


శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ దేశాల అధినేతల సమావేశానికి మన్మోహన్ హాజరవుతున్నారా? తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా వద్దంటున్నా వెళ్లడానికే సిద్ధమయ్యారా?.. 'ఔను, వెళ్తున్నారు..' అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కొలంబోలో హోటల్, ట్రావెల్ అరేంజ్ మెంట్స్ పూర్తయ్యాయని అంటున్నారు. దీనికి తోడు ఒక టీం... ప్రధాని పర్యటన నేపథ్యంలో కొలంబోలో రెక్కీ నిర్వహించి వచ్చిందని చెబుతున్నారు. అయితే, మన్మోహన్ పర్యటనకు సంబంధించిన తుదినిర్ణయం కేబినెట్ మీటింగ్ లో తీసుకుంటారు.

  • Loading...

More Telugu News