: దివాకర్ ట్రావెల్స్ కు చుట్టుకుంటున్న బస్సు ప్రమాదం
మహబూబ్ నగర్ వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సుకు సంబంధించిన ధృవ పత్రాలన్నీ రవాణా శాఖ రికార్డుల్లో దివాకర్ రోడ్ లైన్స్ పేరు మీదే ఉన్నాయని జేటీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంవీ చట్టం ప్రకారం ట్రావెల్స్ మధ్య లీజు అనే పదం, అధికరణ లేదని ఆయన స్పష్టం చేశారు. దివాకర్ రోడ్ లైన్స్ కు, జబ్బార్ ట్రావెల్స్ కు మధ్య లీజు ఒప్పందం ఉన్నట్టు తమ దృష్టికి రాలేదని వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, దివాకర్ ట్రావెల్స్, జబ్బార్ ట్రావెల్స్ కు మధ్య ఒప్పంద పత్రాలు లేకుంటే జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.