: ప్రధాని, సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. ఈ క్రమంలో మిజోరాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 18న సోనియా మిజోరాంలోని లుంగ్లియా పట్టణంలో పర్యటిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ లుజిన్హో ఫలేయిరో తెలిపారు. 21న రాహుల్ మిజోరాం-మయన్మార్ సరిహద్దులోని చంపాయ్, మిజోరాం-అస్సాం సరిహద్దులోని కొలైసింబ్ పట్టణాల్లో నిర్వహించే ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు. అయితే, ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు.