: అఖిలపక్ష సమావేశంపై ఆశలు, అనుమానాలు తగవు: బొత్స
అఖిలపక్ష సమావేశానికి సంబంధించి అనవసరమైన ఆశలు, అనుమానాలు తగవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సమావేశానికి సంబంధించి విధివిధానాలు వచ్చాకే స్పందిస్తామని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, అఖిలపక్ష భేటీలో రాజకీయాల కోసం కాకుండా ప్రజల కష్టాలు చూసి మాట్లాడాలని బొత్స సూచించారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని.. జైల్లో జగన్, గుంటూరు లో విజయమ్మ సమన్యాయం కోసమే దీక్ష చేసారని విమర్శించారు. జగన్ కు మధ్యవర్తిగా జేసీ దివాకర్ రెడ్డిని కాంగ్రెస్ పెట్టిందోమోనని అనుమానం వ్యక్తం చేసిన బొత్స.. పార్టీని నష్టపరిచే వాఖ్యలు ఎవరూ చేయరాదని సూచించారు. అలాంటి వాళ్లు మరొక పార్టీలోకి వెళ్లవచ్చని సలహా ఇచ్చారు.