: న్యూయార్క్ టైమ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు


తెలుగు సినీ పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మేరుపర్వతమంత ఎత్తుకు ఎదిగిన నటుడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తరువాత కెమేరామెన్ గంగతో రాంబాబు ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించినా.. అత్తారింటికి దారేది సినిమాతో బాక్సాఫీస్ ను కుదిపేశాడు. పైరసీని తట్టుకుని నిలిచిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కు తీయటి అనుభవాలనే మిగిల్చింది. ఇటీవల 'న్యూయార్క్ టైమ్స్' నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో '10 మోస్ట్ డిజైరబుల్ ఇండియన్ యాక్టర్స్' జాబితాలో పవర్ స్టార్ కు ఐదవ స్థానం దక్కింది.

మరోవైపు, పాలబుగ్గల యువరాజు మహేష్ బాబు కూడా న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఆరవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రిన్స్ మహేష్ కు టాలీవుడ్, బాలీవుడ్ లో భారీగా అభిమానులున్నారు. మహేష్ బాబు సినిమాలకు బాలీవుడ్ లో మంచి గిరాకీ కూడా ఉంది. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అగ్రస్థానంలో బాలీవుడ్ బాధ్షా షారూఖ్ ఉండగా రెండవ స్థానాన్ని సల్మాన్ ఖాన్ దక్కించుకున్నాడు. మూడోస్థానంలో అక్షయ్ కుమార్ నిలవగా, హృతిక్ రోషన్ నాలుగోస్థానంలో నిలిచాడు. ఐదు, ఆరు స్థానాలు పవర్ స్టార్, ప్రిన్స్ లవి కాగా.. తమిళ స్టార్ విజయ్ 7వ స్థానం లోనూ, బాలీవుడ్ బర్ఫీ రణబీర్ కపూర్ 9వ స్థానంలోనూ, అజయ్ దేవ్ గణ్ 10వ స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News