: యూటీ చేస్తే నేతలు కీలుబొమ్మలవుతారు: దానం
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలవుతారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సమస్యల పరిష్కారంకోసం ఇక్కడివారు ఢిల్లీకి వెళ్లాలా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఉండే అందరి రక్షణ బాధ్యత తమదని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, సోనియాను విమర్శించి పెద్ద నేత అవుదామని జగన్ అనుకుంటే.. అది ఆయన అవివేకమని దానం అన్నారు.