: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...
రేపు రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి అమల్లో ఉంటాయని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...
ఇందిరాపార్కు కూడలి వైపు వాహనాలను అనుమతించరు. అటువైపు వచ్చే వాహనాలను... ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద దారి మళ్లిస్తారు.
డీబీఆర్ మిల్స్ నుంచి వార్త లేన్ పార్క్ వ్యూ అపార్టుమెంటుల మీదుగా ఇందిరాపార్కు వైపు వచ్చే వాహనాలను... గాంధీనగర్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
దోమలగూడ స్ట్రీట్ నెంబర్ 6, 7 ల నుంచి ఇందిరాపార్కు వైపు వచ్చే వాహనాలను... శిల్ప నర్సింగ్ హోమ్ వద్ద నుంచి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 వైపు మళ్లిస్తారు.
గాంధీనగర్ నుంచి వచ్చే వాహనాలను బాకారం కొత్త వంతెన మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు అనుమతించరు. వీరిని గాంధీ నగర్ టీ జంక్షన్ లేదా అశోక్ నగర్ కూడలి వైపు మళ్లిస్తారు.
తెలుగుతల్లి ఫ్లైవోవర్ పైకి వాహనాలను అనుమతించరు.