: నల్గొండ జిల్లాలో వైఎస్ విగ్రహాలు ధ్వంసం
నల్గొండ జిల్లా నేరుడుచర్ల మండలం ఎల్బీనగర్, దొండపాడు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారు. కోదాడలో వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ రోజు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె పర్యటనను నిరసిస్తూ వైఎస్ విగ్రహాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు.