: ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు
మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం రవాణా శాఖ అధికారుల్లో చలనం తీసుకొచ్చింది. దీంతో, ప్రైవేట్ ఆపరేటర్లపై వారు ఉక్కుపాదం మోపుతున్నారు. శంషాబాద్ సమీపంలోని షాపూర్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన రవాణా అధికారులు ఆరు బస్సులను సీజ్ చేశారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వద్ద రెండు బస్సులను జప్తు చేశారు. విజయవాడలో ఎనిమిది బస్సులను సీజ్ చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఐదు బస్సులకు అధికారులు బ్రేక్ వేశారు. ముంబయి-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు బస్సులను జప్తు చేశారు.