: సమస్యలు పరిష్కరించి విభజించాలి: వెంకయ్యనాయుడు
తెలంగాణ ఏర్పాటు చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని ఆ పార్టీ జాతీయ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించి సుహృద్భావ వాతావరణంలో విభజించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బి-టీమ్ గా జేడీయూ, వామపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఏన్డీయేను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ముసుగులా జేడీయూ, వామపక్షాల తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.