: సెల్ ఫోన్ రేడియేషన్ తో మనిషి డీఎన్ఏకి ముప్పు: కేంద్ర మంత్రి ఆజాద్


సెల్ ఫోన్లను అతిగా  వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు తప్పదని ప్రపంచవ్యాప్తంగా  పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ కూడా ఇదే విషయాన్ని నిన్న లోక్ సభలో చెప్పారు.

సెల్ ఫోన్ వినియోగంతో ఉత్పన్నమయ్యే రేడియేషన్ మనిషి డీఎన్ఏని ప్రమాదంలోకి నెడుతుందని వెల్లడించారు. అంతేగాకుండా వీర్యకణాలు, గర్భస్థ పిండాలపైనా దుష్ఫ్రభావం చూపుతుందని ఆజాద్ వివరించారు. డీఎన్ఏ మూలకణాల్లోకి చొచ్చుకెళ్లి వాటిని నాశనం చేస్తుందని, తద్వారా క్యాన్సర్ కారకమవుతుందని ఆయన హెచ్చరించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన 'బయో ఇనిషియేటివ్-2012' నివేదికలోని అంశాలను ఆజాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, సెల్ ఫోన్ రేడియేషన్ ప్రభావం ప్రజలపై పడకుండా నిరోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన లోక్ సభలో ప్రకటించారు. 

  • Loading...

More Telugu News