: పర్యాటక శాఖ కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి వట్టి
పర్యాటక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన బస్సులను ఆ శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు, ఆయన పర్యాటక శాఖ ఉన్నతాధికారి చందనా ఖాన్ తో కలిసి బస్సులను పరిశీలించారు. లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నూతన బస్సుల డ్రైవర్లు ప్రత్యేక దుస్తుల్లో హాజరయ్యారు.