: పటేల్ ప్రధాని అయ్యుంటే బీజేపీ, ఆరెస్సెస్ ఉండేవి కాదు: దిగ్విజయ్


దేశ ప్రథమ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యుంటే దేశ పరిస్థితి మరోలా ఉండేదన్న మోడీ వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ విరుచుకుపడ్డారు. పటేల్ ప్రధాని అయ్యుంటే బీజేపీతో పాటు ఆరెస్సెస్ కూడా ఉనికిని కోల్పోయి ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. మత హింసను ప్రేరేపించిన ఆరెస్సెస్ పై పటేల్ నిషేధం విధించిన సంగతిని మోడీ మరచిపోరాదని సూచించారు.

  • Loading...

More Telugu News