: ఆశారాం బెయిల్ పిటిషన్ తిరస్కరణ
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పదహారేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టైన ఆశారాం రెండు నెలల నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ లను న్యాయస్థానం పలుమార్లు తిరస్కరించింది.