: చంద్రబాబును అడ్డుకున్న సమైక్యవాదులు
సమన్యాయం కాదు... సమైక్యాంధ్ర మాత్రమే కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును విద్యార్థులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనపై నిరసన తెలుపుతూ బాబు కాన్వాయ్ ను పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో దాదాపు అరగంట పాటు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాను లేఖ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.