: మా పార్టీని బీజేపీలో ఎన్నటికీ విలీనం చేయం: యడ్యూరప్ప
తమ పార్టీని బీజేపీలో ఎన్నటికీ విలీనం చేయబోమని... కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తెలిపారు. బీజేపీలో కేజేపీని విలీనం చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో యడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎన్డీయే ప్రధాని అభ్యర్థి అయిన మోడీకి పూర్తి మద్దతిస్తామని తెలిపారు. తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు కొందరు బీజేపీ నాయకులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని యడ్డి విమర్శించారు.