: కేంద్ర ఆహార మంత్రితో శ్రీధర్ బాబు భేటీ
కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రంగు మారిన ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు రంగు మారిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఎఫ్ సీఐ బృందం శుక్రవారం రాష్ట్రానికి రానున్నట్టు మంత్రి తెలిపారు.