: నిర్భయకు అమెరికా 'అంతర్జాతీయ ధీరవనిత' అవార్డు
గత సంవత్సరం డిసెంబర్ 16న కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిన 23 సంవత్సరాల వైద్య విద్యార్ధిని 'నిర్భయ'కు అమెరికా 'అంతర్జాతీయ ధీర వనిత ' అవార్డును ప్రకటించింది. ఈ నెల 8న ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా, స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ చేతుల మీదుగా ఈ అవార్డును బహుకరించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
'ఘటన అనంతరం ఎంతో బాధాకర పరిస్థితుల్లో ఉండి కూడా ఆమె ప్రదర్శించిన ధైర్య, సాహసాలు ఎందరో భారతీయ మహిళలకు ఆదర్శనీయం. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం అద్భుతం. కుమార్తెకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇతరులకి ఆదర్శప్రాయం. చికిత్స సమయంలోనూ ధైర్యంగా పోలీసులకు రెండుసార్లు ఘటనకు సంబంధించి తన వాంగ్మూలం ఇచ్చిం
ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డును10 మంది మహిళలకు ఇస్తున్నట్లు తెలిపింది. 2007లో స్థాపించిన ఈ అవార్డును ఇప్పటి వరకూ 45 దేశాలకు చెందిన 67 మంది మహిళలకు ఇచ్చినట్లు వివరించింది.