: ఆంధ్రప్రదేశ్ బస్సు ప్రమాదం పట్ల ప్రధాని విచారం
ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తరపున ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.