: వ్యభిచారం చేయాలంటూ నర్సింగ్ విద్యార్థినులపై ఒత్తిడి


కాలేజీ అధికారులుగా వారు విద్యార్థుల బంగారు భవిష్యత్ కోరుకోవాలి. కానీ, వారు మానవత్వం లేని మృగాళ్లలా ప్రవర్తించారు. నర్సింగ్ విద్యార్థినులను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా జారా పట్టణంలో ఒక నర్సింగ్ కాలేజీలో ఇది జరిగింది. ఆర్ డీ గార్డి అనే మెడికల్ కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తున్న నర్సింగ్ విద్యార్థినులను వ్యభిచారం చేస్తే డబ్బులు వస్తాయంటూ చీఫ్ మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒత్తిడి చేశారు. అంతేకాదు, వారు కూడా లైంగికదాడికి యత్నించారు.

దీనిపై 14 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆ విషయాన్ని మేట్రన్ కు చెప్పినా ఏమీ మాట్లాడకుండా ఉన్నారని పేర్కొన్నారు. దాంతో, పోలీసులు మేట్రన్ ను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరుపరచగా.. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. అసలు నిందితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ పరారీలో ఉన్నారు. రాత్రి డ్యూటీలు చేయడం ఇష్టం లేకే తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థినులపై నెపం వేసింది.

  • Loading...

More Telugu News