: కూడంకుళంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. నీటి ఫీడింగ్ విషయంలో సమస్య తలెత్తడంవల్ల నిన్న రాత్రి (మంగళవారం) ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. తిరిగి నవంబర్ ఒకటిన ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ తెలిపింది. విద్యుత్ ప్లాంట్ లో ఈ నెలలో ఉత్పత్తిని నిలిపివేయడం ఇది రెండోసారి.