: రూ.2వేలకు పడుచు.. ఆన్ లైన్లో ఓ ప్రకటన


'ఏదైనా అమ్ముకోవచ్చు' ఇది ఓఎల్ఎక్స్ అనే ఉచిత ఆన్ లైన్ ప్రకటనల వెబ్ సైట్ ప్రచార నినాదం. పేరుకు తగ్గట్లుగానే.. ఒక ఆకతాయి ఈ అవకాశాన్ని తమాషా కోసం వాడుకున్నాడు. '22ఏళ్ల అమ్మాయి-కోల్ కతా' అంటూ ప్రకటనను పోస్ట్ చేశాడు. తన పేరు సుమన్ బారు అని, ఆ అమ్మాయి ఏజెంట్ నని, రూ. 2వేలు చెల్లించి అమ్మాయితో ఎంజాయ్ చేయవచ్చని.. సంప్రదించాల్సిన నంబర్ ఇచ్చాడు.

ఒక మీడియా సంస్థ ఆ నంబర్ కు కాల్ చేయగా.. తనకు ఇబ్బందులు కలిగించాలని ఎవరో ఆకతాయి చేసిన పనిగా నంబర్ సొంతదారు చెప్పారు. దీనిపై ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడట. కాగా, ఆ మీడియా సంస్థ ఓఎల్ఎక్స్ భారత మేనేజర్ అమర్ జిత్ బాత్రాను సంప్రదించింది. సదరు ప్రకటనను వెంటనే డిలీట్ చేస్తామని, ఇలాంటి వాటిని గుర్తించి తొలగించేందుకు తమకొక టీమ్ కూడా ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News