: చైనాలో భూకంపం
చైనా జిలిన్ ప్రావిన్స్ లోని ఈశాన్య ప్రాంతమైన హన్ చున్ నగరంలో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. అయితే, భూకంపం సంభవించిన సమయంలో ప్రజలంతా నిద్రలో ఉన్నారని, భూకంపం వల్ల పెద్దగా నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. చైనాలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో హన్ చిన్ ఒకటని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది.