: తస్మాత్‌ జాగ్రత్త! బ్రెయిన్‌ స్ట్రోక్‌ మగాళ్లకే జాస్తి!


ఆ సమస్య బ్రెయిన్‌ ఉన్న వాళ్లకు మాత్రమే కదా! మనకు ఇబ్బందేం ఉండదులెమ్మని మనలో చాలా మంది హ్యాపీ ఫీల్‌ కావొచ్చు గానీ.. మన దేశంలో ఏటా 16 లక్షల మంది దీని బారిన పడుతున్నారంటే నివ్వెరపోక తప్పదు. స్థూల ఆర్థిక ఆరోగ్య జాతీయ కమిషన్‌ తాజాగా ఓ నివేదిక ప్రచురించింది. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వాటిలో గుండెపోటు తర్వాత బ్రెయిన్‌స్ట్రోక్‌ ప్రధాన కారణంగా నిలుస్తుండగా.. అందులో భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు ఈ నివేదిక తెలియజెబుతోంది.

మరో చేదు వాస్తవం ఏంటంటే.. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్న వారిలో 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనట. వృత్తి ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి, జీవనశైలుల్లో వస్తున్న మార్పులు కలిసి ఇలాంటి ఆరోగ్య సమస్యకు దారితీస్తున్నాయని అధ్యయనం బాధ్యత చూసిన ఎయిమ్స్‌ న్యూరాలజీ హెడ్‌ కామేశ్వర ప్రసాద్‌ అంటున్నారు. మొత్తానికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చేంత ఒత్తిడికి గురికాకుండా బతకడం గురించి అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు తెలియజెబుతున్నాయి.

  • Loading...

More Telugu News