: తాలిబాన్లను చర్చలకు ఆహ్వానించిన పాక్ ప్రధాని


పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పాక్ తాలిబన్లను ప్రభుత్వంతో శాంతి చర్చలకు ఆహ్వానించారు. అధికారిక పర్యటనలో భాగంగా లండన్ లో ఉన్న ఆయన ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశంలో శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. తాలిబన్లు చర్చలకు వచ్చి దేశ రాజకీయ విధానంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. మిలిటెంట్స్ తో చర్చలు నిర్వహించాలని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నాయని నవాజ్ షరీఫ్ తెలిపారు.

  • Loading...

More Telugu News