: జీవోఎంకు కేంద్ర హోంశాఖ నివేదిక
విభజన ప్రక్రియపై ఏర్పాటైన మంత్రుల బృందం సభ్యులకు కేంద్ర హోంశాఖ 85 పేజీల నివేదిక అందజేసింది. ఆంధ్రప్రదేశ్ పూర్వాపరాలు, ఆర్ధిక స్థితిగతులు తదితర వివరాలను హోం శాఖ ఈ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర విభజనకు సంబంధించి మంత్రుల బృందం సభ్యులు పరిశీలించాల్సిన అంశాలనూ ఈ నివేదికలో పొందుపరిచింది. జలహక్కులు, సహజవాయువు కేటాయింపులు, హైదరాబాదులో రక్షణ సంస్థలకు చెందిన అంశాలనూ పరిశీలించాలని సూచనలు చేసింది. ఇక పోలవరం, ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టులతో పాటు ఇతర జలవనరులపై పరిశీలించాలని కూడా సూచించింది. అటు విద్య, వైద్య విద్య అంశాలపై పరిశీలించాలనీ హోం మంత్రిత్వ శాఖ కోరింది.