: మహిళల మెదడు ముందు పురుషుల మెదడు తీసికట్టే!
ఆడవాళ్ళు ఎవరికీ ఓ పట్టాన అర్ధం కారని అనాదిగా మన కవులు కావ్యాల్లో వర్ణిస్తూనే వున్నారు. వాళ్ళ మెదడు కూడా అలాంటిదే అని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పరిమాణంలో పురుషుల మెదడు కన్నా మహిళల మెదడు ఎనిమిది శాతం చిన్నదే అయినప్పటికీ, సామర్ధ్యంలో మాత్రం పాదరసంలా పనిచేస్తుందని చెబుతున్నారు.
కొన్ని సందర్భాలలో పురుషుల మెదడుతో సమానంగానూ ... మరి కొన్ని సందర్భాలలో వారి కన్నా మిన్నగానూ మహిళల మెదడు చురుకుగా పనిచేస్తుందట.అయితే, దీనికి కారణం ఏమిటన్నది మాత్రం శాస్త్ర వేత్తలకు అంతుబట్టడం లేదు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది!