: కాంగ్రెస్ అభివృద్ధిలో పటేల్ పాత్ర అమోఘం: ప్రధాని


కాంగ్రెస్ పార్టీ బలోపేతంలోనూ, పార్టీ అభివృద్ధిలోనూ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సర్థార్ వల్లభాయ్ పటేల్ మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ లౌకికవాదని, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. పటేల్, గాంధీ, నెహ్రూ, ఆజాద్ పేర్లను గుర్తు చేసుకుంటే దేశభక్తి పెల్లుబుకుతుందని ఆయన అన్నారు. గాంధీ, పటేల్ ల మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉండేదని.. అలాగే నెహ్రూ, పటేల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. మ్యూజియం ఏర్పాటు చేసి పటేల్ జీవిత విశేషాలు అందరికీ తెలియజేయాలనుకోవడం మంచి ఆలోచన అని కొనియాడారు.

  • Loading...

More Telugu News