: భారతదేశ కుబేరుడు ముకేష్ అంబానీ


మన దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. గత ఆరేళ్ళ నుంచీ ఆయనీ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ముకేష్ నికర ఆస్తి విలువ 1,18,250 కోట్లుగా లెక్కగట్టారు. ప్రపంచ కుబేరులలో మాత్రం ఆయన 22వ స్థానంలో వున్నారు.

కాగా, ప్రపంచ ఐశ్వర్యవంతుడిగా మెక్సికోకు చెందిన వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ నాలుగోసారి కూడా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆయన సంపద విలువ 7,300కోట్ల డాలర్లు. కాగా, మన దేశానికి సంబంధించి ముకేష్ తర్వాత ద్వితీయ స్థానాన్ని లక్ష్మీ మిట్టల్ అందుకున్నారు.

ఇక, ముకేష్ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం ప్రపంచ కుబేరుల సరసన 233 వ స్థానంలో వున్నారు. ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్ తాజా సంచికలో ఈ వివరాలు ప్రకటించారు          

  • Loading...

More Telugu News