: భార్యపై యాసిడ్ పోసిన భర్త
సంగారెడ్డి మండలం శివంపేట్ లో ఓ భర్త తన భార్యపై యాసిడ్ తో దాడి చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిన కసాయి భర్త యాసిడ్ పోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలి భర్త, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.