: మూడున్నర వేల కోట్ల నష్టం వాటిల్లింది: మంత్రి రఘువీరా


భారీవర్షాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడున్నర వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు 1.50 లక్షలు, 18 ఏళ్లు పైబడిన వారికి ఆపద్బంధు పథకం కింది మరో 50 వేల రూపాయలు పరిహారంగా అందించాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. గతంలో పెండింగ్ లో ఉన్న పెట్టుబడి రాయితీని తక్షణం విడుదల చేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా 48,500 ఇళ్లు దెబ్బతిన్నాయని, వచ్చే రచ్చబండలోపు ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News