: నితీశ్.. మోడీనీ తక్కువగా అంచనా వేయొద్దు: జేడీయూ నేత శివానంద్
మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగించాలనుకోవడం కేవలం కలగానే మిగిలిపోతుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత తప్పుబట్టారు. మోడీని తక్కువగా అంచనా వేయరాదని జేడీయూ సీనియర్ నేత శివానంద్ తివారీ హెచ్చరించారు. రైళ్లలో టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి మోడీ చేరుకున్నారని గుర్తుచేశారు. ప్రత్యర్థి బలాలను విస్మరించరాదని శివానంద్ హితవు పలికారు. మోడీ వెనుక బలమైన హిందూ ఆయుధం ఉందని తెలిపారు.