: అత్తవారింటికి వెళ్లనున్న ప్రణబ్
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి తన అత్తగారి ఊరైన భద్రిబిలా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రణబ్ భార్య సువ్రా ముఖర్జీ బంగ్లాదేశ్ లోని భద్రిబిలాలో జన్మించారు. కొన్నాళ్లు అక్కడే నివసించిన తర్వాత ఆమె కుటుంబం భారత్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె సోదరుడు కనాయ్ లాల్ భద్రిబిలాలో ఉంటున్నారు.
పెళ్లయిన తర్వాత ప్రణబ్ ఇంతవరకు ఇక్కడికి రానేలేదు. తొలిసారి ఇక్కడికి రానుండడంతో ఊరికి కొత్త రోడ్లు వేశారు. ఘన స్వాగతానికి పలు ఏర్పాట్లు చేయడంతో కొత్త శోభ వచ్చినట్టైంది. భద్రిబిలాకు హెలికాప్టర్ లో రానున్న ప్రణబ్ ఓ గంటపాటు తన అత్తవారింట గడుపుతారు.