: భారతీయ శ్రీమంతుల జాబితాలో ఆరోసారీ ముఖేష్ కే అగ్రపీఠం
భారతీయ సంపన్నుల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీదే ప్రథమస్థానమని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ముఖేష్ సంపద విలువ 21 బిలియన్ డాలర్లు (లక్ష 29 వేల కోట్లు)గా ఫోర్బ్స్ అంచనా వేసింది. వరుసగా ఆరేళ్ల నుంచి ముఖేష్ అంబానీనే ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు. రెండోస్థానాన్ని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్ మిట్టల్ ఆక్రమించారు. ఈయన సంపద విలువ 16 బిలియన్ డాలర్లు (98 వేల 400 కోట్లు). ఈయన తర్వాత స్థానంలో 13.9 బిలియన్ డాలర్ల (85 వేల 485 కోట్లు)తో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ మూడో స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి 'టాప్ టెన్' లో స్థానం దక్కలేదు.