: అమీర్ ఖాన్ కు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు


బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. తన టీవీ షో 'సత్యమేవ జయతే'తో పలు సామాజిక సమస్యలపై చర్చలు నిర్వహించి, బాధితులకు పరిష్కారం చూపే దిశగా చేసిన విజయవంతమైన ప్రయత్నానికి గాను అమీర్ ను ఈ అవార్డుతో సత్కరించారు. ఈ మేరకు రెండు రోజులకిందట అమీర్ అమెరికా వెళ్లారు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్యాథరిన్ బిగిలో ఉన్నారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. తాము నిర్వహించిన షో ఇతరదేశాల్లో ఎలా ఆసక్తి కలిగించిందో తెలియదన్నారు.

  • Loading...

More Telugu News