: ప్రతిపక్షాల హడావిడి అంతా... మీడియా దృష్టిలో పడేందుకే: సీఎం కిరణ్
ప్రసార మాధ్యమాల కవరేజి కోసమే ప్రతి పక్షాలు మాటిమాటికీ సభను స్థంభింపజేస్తుంటాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్టాండింగ్ కమిటీలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి మార్గదర్శిగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై చట్ట సభల్లో చర్చ జరిగిన తర్వాతే వాటికి ఆమోదముద్ర వేయాలని సీఎం పేర్కొన్నారు.