: పాట్నాలోని గాంధీ మైదానంలో బయటపడ్డ మరో బాంబు
బీహార్ రాజధాని పాట్నాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 'హుంకార్' సభ జరిగిన రెండు రోజుల తర్వాత గాంధీ మైదాన్ వద్ద మరో పేలని బాంబు బయటపడింది. దీనిని బాంబు నిర్వీర్యక దళాలు ఈ రోజు స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించడం, 60 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. బాంబు పేలుళ్ల తర్వాత పోలీసులు మోడీ సభకు వేదికైన గాంధీ మైదాన్ తోపాటు, సమీప ప్రాంతాల నుంచి పేలని బాంబులను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత కూడా మరో బాంబు బయటపడడంతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి.