: ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై సీబీఐ దాడులు
పాస్ పోర్టులు జారీ చేసే ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఈ రోజు సీబీఐ దాడులు నిర్వహించింది. నాంపల్లి ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో సిబ్బంది.. సర్టిఫికెట్లు జారీచేయడంలో పలు అవకతవకలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న సీబీఐ పలు సోదాలు జరిపింది. ప్రతి పనిలోనూ దళారుల జోక్యం పెరిగిందని సీబీఐకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపైనా అధికారులు దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.