: నేడు ఒకే వేదికపైకి వస్తున్న ప్రధాని, మోడీ


ఒకరు ప్రస్తుత ప్రధాని, మరొకరు రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. వారే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. మన్మోహన్ పై పలుమార్లు మోడీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకార్ధంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటుచేసిన మ్యూజియం ప్రారంభోత్సవానికి వీరిద్దరూ హాజరవుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రత్యేక అతిథిగా నరేంద్ర మోడీ వస్తున్నారు. అనంతరం జరగనున్న సభలో వీరిరువురు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ అరుదైన సమయంలో ప్రధాని, మోడీ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News