: పాట్నా పేలుళ్లపై బీహార్ ను ముందే అప్రమత్తం చేశాం: షిండే
పాట్నాలో దాడి జరుగుతుందని బీహార్ ను ముందే అప్తమత్తం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ర్యాలీలతో అలర్ట్ గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించామన్నారు. పాట్నా పేలుళ్ల ప్రాంతాలను హోం శాఖ సెక్రెటరీ, పోలీసులు, ఎన్ఐఏ పరిశీలిస్తున్నారని, అనంతరం తనకు వివరాలను తెలియజేస్తారని షిండే అన్నారు.