: కారులో మగాళ్ల పాడు పని.. వద్దన్న డ్రైవర్ పై ఫిర్యాదు
అది అమెరికా.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని వెస్ట్ హాలీవుడ్ కు చెందిన స్టీవెన్ వైట్, చికాగోకు చెందిన మాథ్యూ మెక్రియా అనే వ్యక్తులు ఓ క్యాబ్ ఎక్కారు. ఇద్దరూ పురుషులే. కారులో ఎక్కినప్పటి నుంచి ముద్దాడుకోవడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం మొదలు పెట్టారు. డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేసి దిగి పొమ్మన్నాడు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చారు. తాము కేవలం ముద్దు పెట్టుకున్నామని.. దానికే డ్రైవర్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ వారు పోలీసుల ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రైవర్ మాత్రం.. వారిద్దరూ ముద్దాడుకోవడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీనిపై గే హక్కుల ఉద్యమ సంస్థ 'లంబ్డా' ఇల్లినాయిస్ మానవహక్కుల విభాగం వద్ద ఫిర్యాదు చేసింది. ఇతర జంటల్లానే తామూ ఒక జంట అంటూ వైట్, మాథ్యూ తమ పనిని సమర్థించుకుంటున్నారు.